VENKATESWARA CHARITABLE TRUST

About


About Venkateswara Charitable Trust

పారిశ్రామిక ప్రాంతానికి ఒక మణిహారం గాజువాక. గాజువాక సమీపంలో బానో జీ తోటకి దగ్గర్లో వాంబే కాలనీలో వెలసిన స్వయంభు ఆలయం దిన దిన అభివృద్ధి చెందుతూ భక్తులు మదిలో నిలిచిపోతుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు, మరెన్నో అవమానాలు ఎదురైన వాటిని భరిస్తూ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో ముందుకు సాగుతున్నారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల. ఆలయ నిర్మాణం వెనుక కథ : ప్రముఖ సంఘ సేవకురాలు మంత్రి మంజులకు ఒకరోజు కాలనీలో ఉన్న కలలో కనిపించి శ్రీ వెంకటేశ్వర స్వామి అతి పెద్ద రాతి విగ్రహాన్ని స్థాపిస్తున్నామని, ఆమెకు దండ వేయమని అడిగినట్లు కల వచ్చిందని తెలిపారు. తనకి కలలో ఇలా ఎందుకు వచ్చిందో నన్ను ఆలోచనలో ఉండగానే అదే కాలనీలో ఉంటున్న ఒక క్రైస్తవ మహిళకు వెంకటేశ్వర స్వామి ఆవహించి తాను ఈ కాలనీలోనే చెప్పడంతో పాటు కొండమీద తనకి ఆలయాన్ని నిర్మించాలని సూచించారు. ఈ విషయం నమ్మని కొంతమంది వెటకారాలు చేసి మంజులను అవమానించారు. మంజుల తనకు ఆలయాన్ని నిర్మించే శక్తిలేదని ఆలోచించి స్థానిక నాయకుడు దొడ్డి రమణ గారితో ఈ విషయంపై చెప్పగా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎన్నిసార్లు కలలోకి రావడం శుభ సూచకముగా భావించి గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస రావు తో మాట్లాడి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయించాలని తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంత మంది క్రైస్తవులు ఆలయ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పాటు చేశారు. మంజులతో వాదనకు దిగి ఘర్షణలకు పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యే అక్కడికి కొద్ది దూరంలోనే వేరే స్థలంలో కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. అయినప్పటికీ క్రైస్తవులు నిరంతరం గొడవ పడడంతో ఆలయ నిర్మాణ పనులను రెండు సంవత్సరాలు ఆపివేయడం జరిగింది. ఆలయం నిర్మాణానికి ముందు హోమం చేశారు, ఆ ప్రాంతంలో ఉన్న హోమగుండం లక్ష్మీ తులసి విష్ణు తులసి కలిసి పెద్ద చెట్లుగా ఏర్పడ్డాయి. ఆ ప్రాంతమంతా తులసి వనంలా మారిపోయింది చుట్టూ పచ్చగా కన్నుల విందుగా తయారైంది
దీంతో స్థానికులు గుర్తించి మంజులకు విషయం చెప్పడంతో ఇదంతా శ్రీ లక్ష్మీదేవి, ఆశీస్సులతో జరిగిందనితెలుసుకున్నారు. అప్పటినుంచి ఆ తులసి వనం ప్రాంతంలో నిత్య దీపారాధన చేయడం మొదలుపెట్టారు. అనుకోకుండా ఒక రోజు అంకుశం స్వామికి పిలవబడే అక్కడికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహాన్ని ఆయన ప్రతిష్ట చేశారు. ఆ విగ్రహానికి 101 ప్రదక్షిణ చేయాలని సూచించారు స్వామి చెప్పినట్లే. మంజుల నిత్య దీపారాధన చేస్తూనే ఆమె మనసులో గట్టిగా వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మనసులో సంకల్పించుకున్నారు. తను నిశ్శాస్థితిలో ఉన్నానని ఆలయ అభివృద్ధి ఏమి చేయలేని బాధపడుతూ ఏడుస్తుండగా అదే రోజు సాయంకాలం కళ్యాణ్ అనే యువకుడు వచ్చి స్వామివారికి రేకుల షెడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేశాడు.

వెంటనే ఈ విషయం తెలుసుకున్న అధికారులు సిబ్బందితో సహా వచ్చి ఆలయాన్ని కూల్చేయాలని హడావుడి చేశారు. మంజుల అధికారులతో మాట్లాడుతూ తాను ఆలయాన్ని నిర్మించడం లేదని భక్తులే నిర్మిస్తున్నారని చెప్పడంతో అధికారులు వెళ్లిపోయారు. అప్పటినుంచి భక్తులు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వచ్చి పూజలు చేసుకుంటూ వెళ్తున్నారు. రథసప్తమి రోజున అన్నసంతర్పణ చేయాలని భక్తులందరూ నిర్ణయించుకుని అందరూ ఇళ్లలోంచి బియ్యం సేకరించి అన్నదానం ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ కురుమ రూపంలో ఉన్న ఒక తాబేలు దర్శనమిచ్చింది. రథసప్తమి రోజున స్వామివారికి పెట్టింది నైవేద్యాన్ని స్వీకరించి శ్రీ వెంకటేశ్వర విగ్రహం చుట్టు ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టింది. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియడంతో భక్తులంతా తొండోప తొండొప్ప తండోపాలుగా విచ్చేశారు.
ఈ విషయాన్ని మీడియాలో కూడా చూపించడం జరిగింది. భక్తులంతా ఒక సేవా సంఘం ఏర్పడి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. స్థానికంగా ఒక ప్రాంతంలో వెంకటేశ్వర స్వామిని ఆ స్వామివారికి 101 కలశాలతో జలాభిషేకం చేశారు. అనంతరం ఆ విగ్రహం కింద ఉన్న ఇటుకలను తీసుకువచ్చి రేకుల షెడ్డుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి గోడలు నిర్మించారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే వెంకటేశ్వర స్వామిగా పేరుపొందారు. ఆలయ నిర్మాణం చేద్దామనుకున్న ప్రతిసారి ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయని మంజుల బాధపడుతూ ఉండగా వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఏడు ఊర్లు తిరిగి జోగి దండం అని చెప్పారు. మర్నాడు మంజుల నియమినిస్టులు పాటిస్తూ ఏడువూర్లు తిరిగి జోగి దండగ డబ్బుతో స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాదులు తీయించడం జరిగింది. రోజులు గడుస్తున్న కొలది భక్తుల కోరిన కోర్కెలు తీరడంతో ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.

Image
Image