పారిశ్రామిక ప్రాంతానికి ఒక మణిహారం గాజువాక. గాజువాక సమీపంలో బానో జీ తోటకి దగ్గర్లో వాంబే కాలనీలో వెలసిన స్వయంభు ఆలయం దిన దిన అభివృద్ధి చెందుతూ భక్తులు మదిలో నిలిచిపోతుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు, మరెన్నో అవమానాలు ఎదురైన వాటిని భరిస్తూ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో ముందుకు సాగుతున్నారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల. ఆలయ నిర్మాణం వెనుక కథ : ప్రముఖ సంఘ సేవకురాలు మంత్రి మంజులకు ఒకరోజు కాలనీలో ఉన్న కలలో కనిపించి శ్రీ వెంకటేశ్వర స్వామి అతి పెద్ద రాతి విగ్రహాన్ని స్థాపిస్తున్నామని, ఆమెకు దండ వేయమని అడిగినట్లు కల వచ్చిందని తెలిపారు. తనకి కలలో ఇలా ఎందుకు వచ్చిందో నన్ను ఆలోచనలో ఉండగానే అదే కాలనీలో ఉంటున్న ఒక క్రైస్తవ మహిళకు వెంకటేశ్వర స్వామి ఆవహించి తాను ఈ కాలనీలోనే చెప్పడంతో పాటు కొండమీద తనకి ఆలయాన్ని నిర్మించాలని సూచించారు. ఈ విషయం నమ్మని కొంతమంది వెటకారాలు చేసి మంజులను అవమానించారు. మంజుల తనకు ఆలయాన్ని నిర్మించే శక్తిలేదని ఆలోచించి స్థానిక నాయకుడు దొడ్డి రమణ గారితో ఈ విషయంపై చెప్పగా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎన్నిసార్లు కలలోకి రావడం శుభ సూచకముగా భావించి గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస రావు తో మాట్లాడి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయించాలని తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంత మంది క్రైస్తవులు ఆలయ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పాటు చేశారు. మంజులతో వాదనకు దిగి ఘర్షణలకు పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యే అక్కడికి కొద్ది దూరంలోనే వేరే స్థలంలో కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. అయినప్పటికీ క్రైస్తవులు నిరంతరం గొడవ పడడంతో ఆలయ నిర్మాణ పనులను రెండు సంవత్సరాలు ఆపివేయడం జరిగింది. ఆలయం నిర్మాణానికి ముందు హోమం చేశారు, ఆ ప్రాంతంలో ఉన్న హోమగుండం లక్ష్మీ తులసి విష్ణు తులసి కలిసి పెద్ద చెట్లుగా ఏర్పడ్డాయి. ఆ ప్రాంతమంతా తులసి వనంలా మారిపోయింది చుట్టూ పచ్చగా కన్నుల విందుగా తయారైంది.
More