1.అన్నధానం:
గాజువాక: 65 వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆన్న సమారాధన
ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్, 76వ వార్డ్ వైసీపీ ఇన్చార్జి, శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ దొడ్డి రమణ నేతృతంలో ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో ప్రతి రోజు అన్నసమారాధన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీహరిపురం వాస్తవ్యులు పేదిరెడ్ల నానాజీ,సత్యవతి దంపతులు వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ముఖ్య అతిథిలుగా మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామి వారిని వేడుకుందాం అన్నారు. అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసినదిగా కోరడమైనది.